![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 12:57 PM
మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాంపల్లి మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.... ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మునుగోడు ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులుశ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణను సంక్షేమంలో అగ్రగామిగా నిలబెట్టి ప్రతి గడపగడపకు తమ సొంత పార్టీగా విజయవంతంగా ముందుకు సాగడం అభినందనీయం.మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల నుండి ప్రజలను మోసాల గురి చేస్తూ ఏ సంక్షేమ కార్యక్రమం పూర్తిగా అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వీటన్నింటిని క్రోడీకరించి కాంగ్రెస్ పార్టీపై సింహ గర్జన పూరించే విధంగా భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి నాంపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.