![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 01:01 PM
TG: వరంగల్ ఎల్కతుర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో BRS హైకోర్టును ఆశ్రయించింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం హైకోర్టులో విచారణ జరిపారు. సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని ప్రభుత్వ తరఫున లాయర్ తెలిపారు. వారంలోగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ నెల 27న సభ నిర్వహించనుండడంతో అంతలోపు వెల్లడించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.