|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 10:36 AM
హైదరాబాద్ - మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి. అయితే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని.. ఏడాది క్రితం అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో బ్రేకప్ కావడంతో, కోమలి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.కాగా 21 ఏళ్ల కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌స్టైల్, డైలీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలతో ఆమెకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది.బ్రేకప్ తర్వాత కోమలి మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని కాపాడినట్లు సమాచారం. ఇటీవల మళ్లీ ఇద్దరి మధ్య సంభాషణలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుకుంటూ కోమలి Tirumalaకు కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ చేసిన ఆ పాదయాత్ర వీడియో ఆమె చివరి పోస్టుగా నిలిచింది.