|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:26 PM
లేటెస్ట్ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ 'మాస్క్'. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది.దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని కవిన్ అండ్ ఆండ్రియా సినిమా విశేషాలు పంచుకున్నారు. కవిన్ మాట్లాడుతూ.. 'దర్శకుడు సెన్సార్ చేయలేని చాలా రా కథను చెప్పాడు.. దీన్ని మరింత కమర్షియల్‌గా తీయమని నేను అతనికి సలహా ఇచ్చాను. ఈ సినిమా థ్రిల్లర్ లేదా కామెడీ జానర్‌లోకి సరిపోదు.. ఇది ఫన్ & మెసేజ్‌తో కూడిన పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్' అని చెప్పుకొచ్చాడు.హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ.. 'సినిమాలో మంచి వ్యక్తులు లేరు.. ప్రేక్షకులు చెత్త నుండి ఉత్తమమైనదాన్ని కనుగొనాలి.. Gvp స్కోర్ కొత్తగా ఉంటుంది.. ఇది ఎంతో ఫన్ అండ్ ఫన్‌గా ఉంటుంది.. ఇక కవిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. షూటింగ్ సెట్‌లో ఎంతో ఫన్నీగా గడిచింది' అని తెలిపింది. కాగా.. 'మాస్క్' సినిమాతో కవిన్ హీరోగా నటిస్తుండగా.. ఆండ్రియా జెర్మియా, రుహానీ శర్మ హీరోయిన్లుగా అలరించబోతున్నారు. వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహిస్తుండగా.. ది షో మస్ట్ గో ఆన్, బ్లాక్ మద్రాస్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Latest News