|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:04 PM
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కాంతార: చాప్టర్ 1' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్, తన పేరుతో జరుగుతున్న ఓ మోసంపై అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తన పేరు వాడుకుంటూ పలువురిని సంప్రదిస్తున్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. "అత్యంత ముఖ్యమైన హెచ్చరిక" అనే శీర్షికతో ఒక పోస్ట్ పెడుతూ, "9445893273 అనే నంబర్‌ను వాడుతున్న ఒక వ్యక్తి, నేనేనని చెప్పుకుంటూ తప్పుడు ఉద్దేశాలతో పలువురిని సంప్రదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ నంబర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు. దాని నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లు పూర్తిగా నకిలీవని స్పష్టం చేస్తున్నాను. దయచేసి ఎవరూ స్పందించవద్దు" అని ఆమె విజ్ఞప్తి చేశారు.ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రుక్మిణి హెచ్చరించారు. "ఇలాంటి మోసాలు సైబర్‌క్రైమ్ పరిధిలోకి వస్తాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా సమాచారం కోసం నేరుగా నన్ను లేదా నా టీమ్‌ను సంప్రదించండి. అప్రమత్తంగా, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి" అని ఆమె పేర్కొన్నారు.
Latest News