|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 10:23 PM
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వచ్చేస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలానే ఉంది. బ్యాడ్ గర్ల్, చిరంజీవ్, కిస్, మిత్రమండలి, బారాముల్లా తదితర తెలుగు స్ట్రెయిట్ & డబ్బింగ్ బొమ్మలు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి.అదే విధంగా, జారన్ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు, మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఇటీవల ఓటీటీలో విడుదలయ్యాయి.కొన్నాళ్ల క్రితం తమిళంలో విడుదలై హిట్ టాక్ సంపాదించిన చిత్రం హౌస్‌మేట్స్ జీ5లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు అది తమిళంలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ అయింది. హారర్ జానర్‌లోని ఈ సినిమా విశేషం ఏమంటే, ఒకే అపార్ట్‌మెంట్‌లో రెండు వేర్వేరు కాలాల్లో రెండు కుటుంబాలు ఉంటాయి. వారిలో ఒకరు మరొకరిని చూసి భయపడతారు. ఫలితంగా ఏమైందనేది స్టోరీ.మరోవైపు, 2023 అక్టోబర్‌లో విడుదలైన ధీమహి సినిమా, దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో చూడవచ్చు.కథ ఏమిటంటే, అమెరికాలో సర్జన్‌గా పనిచేస్తున్న కార్తీక్(సాహస్)కి మేనకోడలు ధీమహి (మహి) అలియాస్ ఆషిక పగడాల అంటే ప్రాణం. కొన్ని రోజుల్లో మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది, చివరికి చంపబడుతుంది. కార్తీక్, ఆమె చావుకు తానే కారణమని బాధపడుతూ, నెక్రోమాన్సీ అనే పద్దతిని ఉపయోగించి ఆమె ఆత్మతో మాట్లాడు, ఆమె మరణానికి బాధ్యుడిని శిక్షించాలనుకుంటాడు. తర్వాత ఏమైందనేది మిగతా కథ.త ఏమైందనేదే మిగతా స్టోరీ.
Latest News