|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:40 PM
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతున్నాడు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్నయ్య, దివంగత నటుడు రమేశ్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకు ఇప్పుడు అధికారిక ముద్ర పడింది.'ఆర్ఎక్స్ 100' చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి, జయకృష్ణను హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తిరుమల కొండల నేపథ్యంలో ఉన్న ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకుంటూ ఈ ప్రకటన చేశారు. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఘట్టమనేని అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది.ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. సరిగ్గా ఇదే తరహాలో గతంలో మహేశ్ బాబును 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయం చేసింది కూడా అశ్వనీదత్ కావడం గమనార్హం.
Latest News