|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:07 PM
బాలీవుడ్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ముంబై జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.గోవిందా స్నేహితుడు, న్యాయ సలహాదారు అయిన లలిత్ బిందాల్ ఈ విషయాన్ని తెలియజేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు గోవిందా ఒక్కసారిగా కళ్లు తిరిగి స్పృహ కోల్పోయారని తెలిపారు. వెంటనే ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించి, ఆయన సూచన మేరకు మందులు ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితిని గమనించి, అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించినట్లు వివరించారు.ప్రస్తుతం గోవిందాకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారని, వాటికి సంబంధించిన రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని బిందాల్ పేర్కొన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
Latest News