|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:10 PM
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ’ గురించి, అందులోని సైకిల్ ఛేజ్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆ సీన్‌లో నటించిన బాలనటికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 36 ఏళ్ల తర్వాత క్షమాపణలు చెప్పారు. ఆ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘శివ’ సినిమాలో హీరో నాగార్జున అన్నయ్య కూతురిగా సుష్మ అనే బాలనటి నటించింది. ఆమెను హీరో సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విలన్లు వెంబడించే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్‌ను గుర్తుచేసుకుంటూ సుష్మ ఇప్పటి ఫొటోను వర్మ షేర్ చేశారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కాగ్నిటివ్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తోందని తెలిపారు.ఈ సందర్భంగా సుష్మను క్షమాపణ కోరుతూ వర్మ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘సుష్మ.. నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆ రిస్కీ షాట్‌తో నువ్వు ఎంతగా భయపడ్డావో ఒక దర్శకుడిగా అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి అంగీకరించు’’ అని వర్మ విజ్ఞప్తి చేశారు.
Latest News