|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:18 PM
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో అలనాటి నటి శోభన ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.గతేడాది ‘కల్కి 2898 ఏడీ’తో చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన శోభన, ‘పెద్ది’లో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆమె పాత్ర సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ని ఇస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘రుద్రవీణ’, ‘రౌడీ అల్లుడు’ వంటి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న శోభన, ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమాలో నటించనుండటం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
Latest News