|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:23 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటనతోపాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా, నిర్మాతగానూ మారారు. తాజాగా వ్యాపార రంగంలో మరో కొత్త అడుగు వేశారు. సమంత తాజాగా ‘ట్రూలీ స్మా’ పేరుతో తన కొత్త క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 'ఒక కొత్త అధ్యాయం మొదలైంది' అనే క్యాప్షన్‌తో ఓ ప్రమోషనల్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News