|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 01:39 PM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం “అఖండ 2”. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రేపు ముంబైలోని జుహూ పీవీఆర్‌లో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పాటను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, కైలాశ్ ఖేర్ కలిసి ఆలపించారని తెలిపారు. "ఈ పాట వింటే మీకు నిద్రపట్టదు. ఆ ఎనర్జీ మనలో తాండవం చేస్తుంది. ఇది కేవలం పాట కాదు, శివుడి శక్తి" అంటూ తమన్ చేసిన పోస్ట్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమా మ్యూజికల్ ప్రమోషన్లకు అదిరిపోయే ఆరంభం లభించినట్లయింది.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాకు అన్ని మార్కెట్లలోనూ గట్టిగా ప్రచారం కల్పించాలని భావిస్తున్నారు.
Latest News