|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 03:37 PM
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.ఈవెంట్ విజయవంతం కావాలంటే అభిమానుల సహకారం ఎంతో అవసరమని రాజమౌళి పేర్కొన్నారు. "ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతీ ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చాలా కఠినమైన సూచనలు జారీ చేశారు. దయచేసి అందరూ సహకరించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి" అని ఆయన స్పష్టం చేశారు.కొందరు ఆన్‌లైన్‌లో పాసులు విక్రయిస్తున్నారని, ఇది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని రాజమౌళి తెలిపారు.ఈవెంట్ వేదిక వద్దకు చేరుకునే మార్గాల గురించి కూడా ఆయన వివరించారు. "మీ పాసులపై క్యూఆర్ కోడ్‌లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే, వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయి" అని తెలిపారు.
Latest News