|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 03:40 PM
నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. విలక్షణమైన నటుడిగా .. విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందినదే 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఆయనే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: ఘటికాచలం (నరేశ్) 65 ఏళ్లకి దగ్గరలో ఉంటాడు. భార్య దుర్గా (రాజ్యలక్ష్మి)ని కోల్పోయిన ఆయన, తన కొడుకులు .. కోడళ్లతో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. పెద్ద కొడుకు అరుణాచలం (గిరిధర్) పెద్ద కోడలు దేవి (ప్రశాంతి) చిన్న కొడుకు భద్రాచలం (విజయ్ భాస్కర్) చిన్నకోడలు రాణి (శిరీష) ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు. కొడుకులిద్దరూ ఎలాంటి ఉద్యోగం చేయకపోవడంతో, ఘటికాచలానికి ప్రతి నెలా వచ్చే 'పెన్షన్' పైనే ఇల్లు నడుస్తూ ఉంటుంది.ఘటికాచలానికి ఆ ఇంట్లో ఎలాంటి ప్రేమానురాగాలు .. గౌరవ మర్యాదలు ఉండవు. ఆయన పెన్షన్ తోనే తప్ప, ఆయనతో ఎవరికీ పనుండదు. ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన, తనకి ఓ తోడు అవసరమని భావిస్తాడు. పనిమనిషిగా ఉన్న భవాని (వర్షిణి) మాత్రమే తనని కాస్త పట్టించుకోవడం ఆయనకు ఊరట కలిగిస్తుంది. దాంతో ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా, ఆయన భవానిని వివాహం చేసుకుంటాడు. ఇకపై 'పెన్షన్ కూడా భవానియే తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మిగతా వాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. ఘటికాచలంతో ఇన్సూరెన్స్ చేయించి, ఆయనను చంపేయాలని నిర్ణయించుకుంటారు. భవానితో పెళ్లి రిజిస్టర్ కాలేదు గనుక, ఆమెను తేలికగానే వెళ్లగొట్టొచ్చని అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? వాళ్లు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.
Latest News