|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 04:14 PM
ఇన్ పెర్టిలిటీ అనే సెన్సిటివ్ ఇష్యూకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి రూపొందించిన చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు'. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఎవరి మనోభావాలు గాయపరచకుండా ఈ దర్శకుడు ఎలా తెరకెక్కించారు? ఈ సినిమాతో హీరో విక్రాంత్‌కు హిట్ వచ్చిందా? లేదా చూద్దాం.
కథ: చైతూ అలియాస్ చైతన్య (విక్రాంత్) చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటాడు.సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బ్యాచ్‌లర్‌గా, ఒంటరిగా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు పరీక్ష రాయడానికి వచ్చిన కల్యాణి ( చాందిని చౌదరి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వరంగల్‌లో ఉండే కల్యాణి కోసం వరంగల్ వెళ్లి ఆమెకు తన ప్రేమను తెలియజేయాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. మొదట్లో కల్యాణి ఇష్టపడక పోయినా, అతని మనస్తత్వం నచ్చి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్)ను ఎదిరించి, ఆయనకు ఇష్టం లేకపోయినా చైతూను పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి తరువాత ఓ బిడ్డను కనేసి తండ్రి చేతిలో పెడితే అన్ని సమస్యలు పోతాయని భావిస్తుంది కల్యాణి. కానీ పిల్లల విషయంలో ఈ జంట చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. పిల్లల కోసం వైద్యురాలిని సంప్రదించి కొన్ని పరీక్షలు చేయించుకోగా, చైతన్యకు ఓ సమస్య ఉందని బయటపడుతుంది. ఆ సమస్య ఏమిటి? ఈ సమస్య వల్ల అతను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చైతూ నుంచి తన కూతురిని విడదీసి, మరో పెళ్లి చేయాలనుకున్న కల్యాణి తండ్రి ఆశలు ఫలించాయా? చివరికి చైతన్య, కల్యాణిలు తల్లిదండ్రులు కాగలిగారా? ఈ కథకు జాక్ రెడ్డి (తరుణ్ భాస్కర్)కు సంబంధం ఏమిటి? భ్రమరంగా వెన్నల కిషోర్ ఎలాంటి వినోదాన్ని అందించాడు అనేది మిగతా కథ
Latest News