|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 01:51 PM
నేడు (శనివారం) సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా మహేశ్ బాబు తన తండ్రితో ఉన్న అరుదైన ఫోటోను పంచుకున్నారు. “ఈ రోజు నిన్ను కొంచెం ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నా… నువ్వు గర్వపడతావని తెలుసు నాన్నా” అంటూ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. కాగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు కృష్ణ. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ 2022 నవంబరు 15న గుండెపోటుతో కన్నుమూశారు.
Latest News