|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:41 PM
మాస్ మహారాజ రవితేజ నటించిన 'మాస్ జాతర' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. కేవలం 20 కోట్ల వ్యాపారం చేసిన ఈ సినిమా, 11 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి దాదాపు 9 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అయితే, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం ఉన్నప్పటికీ, సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ నెల 20వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.
Latest News