సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 12:08 PM
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా దర్శకద్వయం నితిన్, భరత్ తెరకెక్కించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌లో రూపొందింది. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. ఈనెల 11న విడుదలవుతోంది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘ప్రియమారా మౌనాల చాటు మాటలే తెలియదా’ అంటూ సాగే వినసొంపైన మెలోడీని మేకర్స్ విడుదల చేశారు. రాకేందు మౌళి పాటను రచించగా, శరత్ సంతోష్, లిప్సిక భాష్యం ఆలపించారు. రధన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోదాటి పవన్‌కల్యాణ్, డీఓపీ: ఎమ్‌ఎన్ బాలరెడ్డి.
Latest News