|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 04:37 PM
మంచు విష్ణు కథానాయకుడిగా, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ బెంగళూరులో పర్యటించింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మోహన్‌బాబు, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలుత 'కన్నప్ప' చిత్రంలో శివుడి పాత్ర కోసం శివరాజ్‌కుమార్‌ను సంప్రదించామని, అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల ఆయన నటించలేకపోయారని తెలిపారు. "కన్నడ రాష్ట్రం, ఇక్కడి ప్రజల గురించి తలుచుకుంటే మాకు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ గారే గుర్తుకొస్తారు. ఆయన ఆశీస్సులు మాకు, నా బిడ్డకు కావాలి. ఆయన నటన గురించి మాట్లాడే స్థాయి లేదు. రాజ్‌కుమార్ తర్వాత ఇక్కడ మాకు అత్యంత ఆత్మీయుడు అంబరీష్. అతను మరణించాక ఇక్కడికి రావాలంటే సంశయించేవాడిని. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మనమంతా దేవుడు నడిపించే బొమ్మలం" అని మోహన్‌బాబు అన్నారు.సినిమా జయాపజయాలు మన చేతిలో ఉండవని, నిజాయితీగా కష్టపడ్డామా లేదా అన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ఏదైనా కన్నడ చిత్రంలో నటించాలనే కోరిక తనకుందని, అప్పట్లో రాజ్‌కుమార్ గారిని అడగడానికి ధైర్యం సరిపోలేదని అన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు శివరాజ్‌కుమార్ నటిస్తున్న తదుపరి చిత్రంలో తనకు విలన్‌గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.
Latest News