by Suryaa Desk | Fri, Jul 05, 2024, 12:16 PM
నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని కలిశారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని.. భవిష్యత్లో ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తానని సోనూ సూద్ కుమారి ఆంటీకి చెప్పారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం స్ట్రీట్ ఫుడ్ అమ్మడం ప్రారంభించిన కుమారి ఆంటీ నేడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు.ఇనార్బిట్ ITC కోహినూర్ హోటల్ దగ్గరున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల దగ్గర సడన్ గా ఒక ఆడి కారు ఆగింది. అందులోంచి దిగిన నటుడు సోనూసూద్.. ఆయన రోడ్డు పక్కడ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీని కలిసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని కలిశారు.ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. తాను రూ.80 కస్టమర్ అంటూ అక్కడ నవ్వులు పూయించాడు సోనూసూద్. అదే సమయంలో తనకు ఎంత డిస్కౌంట్ ఇస్తారని అడుగగా.. మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పింది. ఈ రోజు నాకు లాటరీ తగిలింది. ఫ్రీగా పెడతానంటే ప్రతి రోజు వస్తానని సోనూ అన్నాడు.మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని.. భవిష్యత్లో ఎలాంటి సహాయం అవసరమైనా.. చేస్తానని సోనూ సూద్ కుమారి ఆంటీకి చెప్పారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు.