![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 03:04 PM
వానాకాలం పంట కొనుగోలు లో భాగంగా మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్గల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.యాసంగి సీజన్ లో సిరిసిల్ల జిల్లా పరిధిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా, మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 42, మెప్మా ద్వారా 6, డిసిఎంఎస్ ద్వారా 1 మొత్తం 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.