![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 06:24 PM
తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.స్లాట్ బుకింగ్ ద్వారా 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.పత్రాల రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.ప్రారంభంలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.