![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 09:59 PM
క్యాంపస్ లోపలికి పోలీసులను యూనివర్సిటీ రిజిస్ట్రార్ అనుమతించారని, విద్యార్థుల పట్ల లాఠీ ఛార్జ్‌కు కారణం అతనే అని నిరసనకు దిగిన విద్యార్థులు . యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల జరిగిన విధ్వంసానికి రిజిస్ట్రార్ పూర్తి బాధ్యత తీసుకోవాలని, విద్యార్థుల పట్ల నమోదైన అన్ని కేసులను కొట్టేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలని HCU విద్యార్థులు డిమాండ్ చేశారు.హెచ్సీయూలో అలజడి సృష్టించిన విద్యార్థులపై కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఆదేశించారు. మార్చి 30న (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు వర్సిటీ ఈస్ట్ క్యాంపస్ వద్ద భూమి చదును పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు వచ్చి పోలీసులతో పాటు పని చేస్తున్న వారిపై దాడులకు దిగారు.