![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 02:08 PM
CU భూముల్లో ₹10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. ఈ భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. భూయాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే ₹10 వేల కోట్ల లోన్ ఇచ్చిన ICICI బ్యాంకు క్రెడిబిలిటీని కోల్పోయిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని మోదీ విచారణకు ఆదేశించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న తెలంగాణ రైతన్న కడుపు మీద కొట్టారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరాల్చి భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. HCU విధ్వంసంపై దేశం మొత్తం నివ్వెరపోయి చూసిందన్నారు.