![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 03:05 PM
తెలంగాణ రాష్ట్రంలో సమాచార సాంకేతిక విప్లవం దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని ప్రతి గృహానికి, ప్రతి కార్యాలయానికి టీ ఫైబర్ ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ లక్ష్యాన్ని ఆరు నెలల్లో సాధించేందుకు విస్తృతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బేగంపేటలోని సెంటర్ పాయింట్ భవనంలో నూతనంగా ప్రారంభించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టీ ఫైబర్ ప్రాజెక్టు కేవలం ఇంటర్నెట్ సేవలను అందించడానికి మాత్రమే పరిమితం కాదని.. దీని ద్వారా టెలిఫోన్, కంప్యూటర్ , స్మార్ట్ టెలివిజన్ సేవలను కూడా ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.