|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 12:28 PM
జనగామ జిల్లా బచ్చన్న పేట మండలం కొన్నే గ్రామంలో శ్రీ శ్రీ బీరప్ప స్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు,జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.ముందుగా దొడ్డి కొమురయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఆ తర్వాత భారీ ర్యాలీ గా వెళ్లి శ్రీ బీరప్ప స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు కొన్నే గ్రామంలో శ్రీ శ్రీ బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఆలయాలు మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు.ఈ ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు.గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి,ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజల ఆశీర్వాదాలతో మరింత సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,గ్రామ పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.