|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 12:22 PM
నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుల మధ్య ఉన్న అనుబంధంపై ఇటీవల పుకార్లు ఊపందుకున్న వేళ, సమంత షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్‌ను హగ్ చేస్తూ ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సమంత, “గత ఏడాదిన్నరలో నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేశాను, చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా” అని పేర్కొన్నారు. రాజ్-డీకే నిర్మించిన ది ఫ్యామిలీ మాన్ 2, సిటడెల్: హనీ బన్నీ ప్రాజెక్టుల్లో సమంత నటించారు.