|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 07:03 PM
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటి నుంచి మంచి ఆదరణతో ప్రదర్శితమవుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలో సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ వేడుక చుట్టూ ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరగనున్న ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో, విజయ్-రష్మిక అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ వేదికపైనే వీరిద్దరూ తమ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించి, అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.గత కొంతకాలంగా విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీరికి రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయాలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రష్మిక, తాను విజయ్‌నే పెళ్లి చేసుకుంటాననే అర్థం వచ్చేలా ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో నిమిషాల్లో వైరల్ అయ్యాయి.
Latest News