|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 10:38 AM
'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలిని పాండే హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో షాలిని నటించింది. తాజాగా ఆమె డబ్బావాలా కార్టెల్ సిరీస్ లో నటించింది. ఇందులో ఒక బలమైన మహిళ పాత్రను ఆమె పోషించింది. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. 'అర్జున్ రెడ్డి'లాంటి సినిమాలో మళ్లీ నటిస్తారా? అని ఆమెను యాంకర్ ప్రశ్నించారు. ఆ చిత్రం తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిందని... అందులో తన పాత్ర కొంచెం బలహీనంగా ఉంటుందని తెలిపింది. మరోసారి అలాంటి మూవీలో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. అయితే, డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకుంటానని తెలిపింది. బలమైన క్యారెక్టర్లు చేయాలనేది తన కోరిక అని... ఆ కోరిక డబ్బావాలా కార్టెల్ సిరీస్ తో తీరిపోయిందని చెప్పింది.
Latest News