|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 10:50 AM
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు..ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు..డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు సురక్షితంగా పుడమిని చేరినట్లు నాసా ప్రకటించింది..స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటికి వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. కాగా… వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్‌తో నాసా, స్పేస్-ఎక్స్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.. 288రోజులపాటు విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉన్నారు. మూడో అంతరిక్ష యాత్రను సునీత విజయవంతంగా ముగించారు.. కాగా.. సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి.. గుజరాత్‌లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తంచేసింది.సునీత రాక పై సినీ సెలబ్రెటీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టర్ చిరంజీవి సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా రావడం పై సంతోషం వ్యక్తం చేశారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు బ్లాక్ బస్టర్. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలి అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
Latest News