|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 04:08 PM
హిందీలో 'క్రష్డ్' సిరీస్ నాలుగు సీజన్స్ గా 'అమెజాన్ మినీ ప్లేయర్' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2022 జనవరిలో ఫస్టు సీజన్ 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్ లో మరో 6 ఎపిసోడ్స్ ను సీజన్ 2 గా వదిలారు. 2023 నవంబర్లో 3వ సీజన్ .. 2024 ఫిబ్రవరిలో 4వ సీజన్ పలకరించాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా తెలుగులో అందుబాటులోకి వచ్చాయి.
కథ: లక్నో సెంట్రల్ కాన్వెంట్ స్కూల్ నేపథ్యంలో సాగే కథ ఇది. సంవిధాన్ శర్మ ( రుద్రాక్ష జై స్వాల్) ఆద్య మాధుర్ ( ఆద్య ఆనంద్) ప్రతీక్ (నమన్ జైన్) జాస్మిన్ (ఉర్వి సింగ్) సాహిల్ (అర్జున్) వీళ్లంతా కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటారు. జాస్మిన్ ను తొలిసారి చూడగానే సంవిధాన్ మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె వైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం అతనిని నిరాశకి గురిచేస్తుంది. అప్పుడే జాస్మిన్ ఫ్రెండ్ ఆద్యపైకి అతని దృష్టి వెళుతుంది. అప్పటి నుంచి అతను ఆద్యను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆద్యకు కవితలు చదవడమన్నా .. రాయడమన్నా చాలా ఇష్టం. ఆ విషయంలో తనకి నైపుణ్యం లేకపోవడం సంవిధాన్ కి అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. కవితలు రాయడంలో మంచి ప్రవేశము ఉన్న సాహిల్ .. ఆద్యను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం మొదలుపెడతాడు.సంవిధాన్ స్నేహతుడు ప్రతీక్, జోయా (అనుప్రియ కరోలి)న ముగ్గులోకి దింపుతాడు. ఆద్య - సంవిధాన్ లవ్ ట్రాక్ సాఫీగా సాగేలా అతను సహకరిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో సాహిల్ రాసిన కవితలను సంవిధాన్ రాస్తున్నాడనుకుని అతనికి చేరువైన ఆద్య, ఆ తరువాత నిజం తెలుసుకుని షాక్ అవుతుంది. కవితలను ఇష్టపడే ఆద్య, సాహిల్ వైపు ఆకర్షితురాలు అవుతుందేమోనని సంవిధాన్ సందేహిస్తాడు. అందుకు తగినట్టుగానే ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.
Latest News