|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 06:11 PM
బహుముఖ నటుడు విక్రమ్ తదుపరి చిత్రం 'వీర ధీర శూరన్' లో కనిపించనున్నాడు. దీనికి చిత్త ఫేమ్ SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ ని మార్చి 20న రాత్రి 7 గంటలకి చెన్నైలోని వెల్ టెక్ యూనివర్సిటీ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ 1 నిమిషం 46 సెకండ్ల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సామాచారం. వీర ధీర శూరన్ పార్ట్ 2 షూటింగ్ పూర్తయింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు వీర ధీర శూరన్‌ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో SJ సూర్య, సిద్ధిక్ మరియు సూరజ్ వెంజరమూడుకీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్ర సాంకేతిక బృందంలో జి.వి.ప్రకాష్ సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్, ప్రసన్న జికె ఎడిటర్, సిఎస్ బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీర ధీర శూరన్ మార్చి 27న విడుదల కానుంది.
Latest News