|
|
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 12:10 PM
బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంలో నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి పీఎస్‌కు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమెషన్స్ చేసినందుకు విష్ణుప్రియతో సహా ఇప్పటివరకు 11 మందిపై కేసు నమోదు అయింది. వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్‌లపై బీఎన్‌ఎస్ 318(4) 3, 3ఏ, టీఎస్‌జీఏ, 66డీఐటీఏ-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్‌పై పోరాటం జరుగుతున్నది. దీనికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ వీసీ సజ్జనార్ సైతం మద్దతు పలికారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిని అన్‌ఫాలో చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పలువురు బెట్టింగ్ యాప్స్‌ని ప్రచారం చేసిన వారంతా.. ఇప్పుడు తమ వీడియోలను తొలగిస్తున్నారు.
Latest News