|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:29 PM
నటి సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘చచ్చినా చూడాల్సిందే’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు.అప్పుడప్పుడే పల్లెటూళ్లకి డీటీహెచ్‌లు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను (హర్షిత్ మల్గిరెడ్డి )లోకల్‌గా కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ని నడిపిస్తుంటాడు. తన స్నేహితుల (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి)తో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) పోటీగా వచ్చి అందరికీ డీటీహెచ్‌లని అలవాటు చేస్తుంటాడు. ఆ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో ఉండగానే బ్యాంక్‌లో పనిచేసే శ్రీవల్లి (శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన ఇద్దరు స్నేహితుల ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి. వాళ్ల భార్యలు కూడా రాత్రి 9 గంటలు అవ్వగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తుంటారు
Latest News