|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:31 PM
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ‘ది ట్రైటర్స్’ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా, టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి కూడా కంటెస్టెంట్‌గా వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. మంచు లక్ష్మి ఈ వార్తను ధృవీకరిస్తూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. ఈ రియాలిటీ షోపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.ఇంకా గమనిస్తే లక్ష్మి ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా మంచు లక్ష్మి తన హోమ్ ను ముంబైకు మార్చేసుకుంది. అప్పుడప్పుడు మాత్రమే టాలీవుడ్ లో కనిపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి అసలు ముంబై రెగ్యులర్ గా వెళ్లడానికి కారణమేంటో ఇన్నాళ్లకు తెలిసింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ లో ది ట్రయేటర్స్ అనే రియాలిటీ షోను చేస్తున్నాడు.
Latest News