by Suryaa Desk | Fri, Sep 27, 2024, 03:01 PM
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆందోళన నిర్వహించి ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ మాజీ సర్పంచ్ లు.సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సర్పంచ్ల ఫోరం.శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం..అని ప్రకటించిన సర్పంచులు నర్సంపేట నియోజకవర్గం 6 మండలాల ప్రజా పరిషత్ కార్యాలయలా ముందు నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ, నల్లబేల్లి, మండలాలలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఎంపీడీవోలకు వినతిపత్రం ఇవ్వడం అయినది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న పార్లమెంటు ఎన్నిక ల్లో ముందు సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచులకు గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదు . గ్రామాలలో ఐదు సంవత్సరాలుగా సేవ చేసి అభివృద్ధి చేసి ఆర్థికంగా చిదిగిపోయిన మమ్మల్ని వేధింపులకు గురి చేయకుండా తక్షణమే ఈ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి .లేనిచో భవిష్యత్తులో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము. 27 శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమా నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తాం.ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి లేనిచో రాష్ట్రస్థాయిలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.