by Suryaa Desk | Thu, Nov 21, 2024, 07:50 PM
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.1400 పెరిగి రూ.79,300లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర ఫ్లాట్‌గా రూ.93 వేల వద్ద కొనసాగింది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర 77,900 వద్ద ముగిసింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1400 వృద్ధితో రూ.78,900 వద్ద కొనసాగితే, బుధవారం రూ.77,500 వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.568 పెరిగి రూ.76,602లకు చేరుకున్నది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ఇన్వెస్టర్లకు బంగారం స్వర్గధామంగా మారిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 19.80 డాలర్లు పుంజుకుని 2695.40 డాలర్లకు చేరుకున్నది. అలాగే ఔన్స్ వెండి ధర సైతం 31.53 డాలర్లు పలికింది