by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:46 PM
ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ వారోత్సవాల ముగించు కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి వాక్ తాన్ ( ర్యాలీ) నీ పురవీధుల గుండా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి అన్న ప్రసన్న కుమారి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుని సరియైన ఆంటీ బయాటిక్స్ మందులు సరైన డోసులో పూర్తి కాలం వాడాలని అని అన్నారు.
సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మలవిసర్జన తర్వాత వంట వండుటకు ముందు ఆహారం భుజించుటకు ముందు చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవాలన్నారు. ఒకరు వాడే మందులు మరి ఒకరు వాడకూడదు అని అన్నారు. ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కిరణ్ డిప్యూటీ డిఎం ఎచ్ ఓ, మంథిని , స్థానిక వైద్యులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ మమత, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కిరణ్, అనిల్ క్వాలిటీ మేనేజర్, వెంకటేశ్వర్లు డిప్యూటీ డెమో, రాజేష్ ఎం పి హెచ్ ఈ ఓ,పి ఎచ్ సి రాగినేడు రాఘవపూర్ యు పి ఎచ్ సి పెద్దపల్లి ఆరోగ్య కార్యకర్తలు సూపర్వైజర్లు పాల్గొన్నారు.