by Suryaa Desk | Sat, Nov 23, 2024, 03:41 PM
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల దళిత డిక్లరేషన్ లో ఎస్ సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున కార్జె , బలపర్చిన రాహుల్ గాంధీ మొదటి నుండి దళితులకు అండగా నిలబడి వారి అభివృద్ధి కీ తోడ్పాటు అందించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ సీ రిజర్వేషన్ వర్గీకరణ కు కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ సీ వర్గీకరణ చేయుటకు ఉషామేహర కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. సుప్రీం కోర్టు లో వర్గీకరణ కు అనుకూలంగా వాదించటానికి అడ్వాకెట్స్ ను నియమించి వాదించి గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ అసెంబ్లీ లో ఎస్ సీ ఉప వర్గీకరణ చేస్తామని ప్రకటించి అసెంబ్లీ లో డప్పు కోటింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ సీ వర్గీకరణ చేయుటకు మంత్రి వర్గ ఉపసంఘం, మరియు ఏక సబ్య కమిషన్ వేసి డిసెంబర్ వరకు రిపోర్ట్ కోరింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ సీ ఉప వర్గీకరణ కు ఎవరు అడ్డుపడ్డ ఆగకుండా ముందుకు సాగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్ సీ కులాలకు ఎస్ సీ ఉప వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేయటానికి సిద్దపడ్డ కాంగ్రెస్ పార్టీ కీ అండగా నిలబడటానికి " డిసెంబర్ 1 న మాదిగల విజయ గర్జన సభ " సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ సభ కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులు మరియు మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సభ కు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆహ్వానించుటకు డాక్టర్ ఏ. చంద్రశేఖర్ మాజీ మంత్రి వర్యులు, మరియు దేవని సతీష్ మాదిగ గారు, గజ్జెల కాంతం, ఉట్ల వరప్రసాద్, మెంటేపల్లి రాములు ఉన్నారు. ఈ సభ కు మరో ముఖ్య అతిథితులుగా మంత్రి దామోదర రాజానర్సింహా గారు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు మరియు మాదిగ ఎమ్మెల్యే లు పాల్గొంటారు అని తెలిపారు.