by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:56 PM
తెలంగాణా రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా మల్లన్న టీం ఉంటుందని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు గుండవేన స్వామి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అథితిగా పాల్గొన్న స్వామి మాట్లాడుతూ, మల్లన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్మారం మండల అధ్యక్షుడిగా ఎర్రం సంజీవును ఎన్నుకున్నారు.
సంజీవుకు నియామక పత్రాన్ని అందించి స్వామి అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కాసిపేట ఉదయ్, జిల్లా నాయకులు అడ్లూరి గంగారాం, నియోజకవర్గం అధ్యక్షులు చల్ల సాయికృష్ణ పటేల్, మండల అధ్యక్షులు శివదాస్, పాలకుర్తి మండలం అధ్యక్షులు బొప్పు జాషువ, ఉపాధ్యక్షులు వెంకటేష్ సభ్యులు రాజుగౌడ్, అభిగౌడ్, భూపెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.