by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:57 AM
సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులోనిపల్లి గ్రామంలోని మరాఠి నర్సింలు ఇంటిలో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గౌరారం పోలీసులు వెళ్లి రైడ్ చేయగా 4 గురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 36,860 వేల రూపాయలు, 4 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. గౌరారం పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పేకాట ఆడిన వారి వివరాలు.
1 మరాఠీ నర్సింలు, నివాసం అవుసులోనిపల్లి
2 కుంట గోపాల్ రెడ్డి, నివాసం అన్న సాగర్
3 నీల నర్సింలు, నివాసం తునికి బొల్లారం
4 సర్వన్న గారి కృష్ణారెడ్డి, నివాసం తునికి బొల్లారం
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం ఆడే ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.