by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:59 PM
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో నూతనంగా తయారు చేసిన పేషంట్స్ ఫైల్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ ల రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీ భద్రపర్చేందుకు నూతనంగా ఫైల్ లను తయారు చేయడం జరిగిందని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సేవలు అందుతున్నాయని కలెక్టర్ తెలిపారు.గత 4 నెలల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య, ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలు.
డెంటల్ శస్త్రచికిత్సలు,స్కానింగ్ సేవలు చిన్నపిల్లల వైద్యం ఔట్ పేషెంట్ మరియు ఇన్పేషెంట్ సేవలు,కంటి శస్త్ర చికిత్సలు, టీ - హబ్ ద్వారా 56 రకాల రక్త పరీక్షలు, ఇతర వైద్య చికిత్సలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. ఇన్ పేషెంట్ రోగుల రికార్డు నిర్వహణకు ఉపయోగపడే విధంగా ఫైళ్లను తయారు చేసినందుకు సూపరింటెండెంట్ నీ మరియు సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. జిల్లా లో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సల అందించే దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారులు డాక్టర్ వాసు దేవరెడ్డి డాక్టర్ స్రవంతి ,డాక్టర్ భార్గవి , తదితరులు పాల్గొన్నారు.