by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:43 AM
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రి నుంచి 200 పడకల ఆసుపత్రిగా చేయబోతున్న సందర్బంగా నేడు పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా ,ఆర్ డి ఓ రమణా రెడ్డి,తహసీల్దార్ సంతోష్ కిరణ్ తో కలిసి పరిశీలించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
వారితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు,మాజి మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్,RDO రమణా రెడ్డి,తహసీల్దార్ సంతోష్ కిరణ్,యువ నాయకులు బాబు రామ్ నాయక్,సుభాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.