by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:06 PM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లో శనివారం గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పండరి ఆధ్వర్యంలో, గజ్వేల్ న్యాయవాదులకు ఫోరెన్సిక్ మీద అవగాహన కోసం ప్రోబ్ ల్యాబ్ డైరెక్టర్ మోహన్ ఎర్రోళ్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గజ్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ ప్రియాంక హాజరైనారు. ఈ సందర్బంగా గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండరి మాట్లాడుతూ మన న్యాయవాదులకు క్రిమినల్, సివిల్ కేస్ లలో ఫోరెన్సిక్ లో భాగమైన డాక్యుమెంట్లోని సంతకాల ఫోర్జరీ,
డిజిటల్ లో భాగమైన సి సి ఫుటేజ్, ఫేస్ మార్ఫింగ్ మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సివిల్ జడ్జ ప్రియాంక మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సులు న్యాయవాదులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే న్యాయవాదుల కోసం ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తే జూనియర్ న్యాయవాదులకు ఎంతో మేలు జరుగుతుందని బార్ అధ్యక్షుడు పండరి కి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు హాజరై హర్ష వ్యక్తం చేశారు.