by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:24 AM
సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ జిల్లా పోక్సో న్యాయమూర్తి జయంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. మాలి పటేల్ వసంతరావు 12 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడు. గుర్తుతెలియని మాత్రలు వేసి అబార్షన్ చేయించాడు. ఫిర్యాదుదారు 07-07-2018 హాద్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించారు.