by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:02 PM
ప్రజలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వంద పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజి ఏర్పాటు చేస్తున్నామని అందుకు గాను ప్రభుత్వం రూ. 26 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. రూ. 170 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని అన్నారు.