by Suryaa Desk | Sat, Nov 23, 2024, 03:08 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం లోని గూడూరు గ్రామ పంచాయతి వాసులు బాలగోని శ్రీధర్, పానుగంటి రామకృష్ణ, వేముల సంపత్ కుమార్ లను, వేర్వేరు ప్రాంతాల్లో ఆక్సిడేంట్లు జరగగా వారికి చేతులు విరిగి, పలు గాయాల బారిన పడి, చికిత్స తీసుకుంటూ స్వగృహం లోనే ఉన్న విషయం తెలుసుకున్న, గూడూరు మాజీ ఎంపీపీ, సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్, గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, వారి స్వగృహాలకు చేరుకొని, వారిని కలిసి, పరామర్శించి తగు జాగ్రత్తలు చెప్తూ, పలు సూచనలు ఇచ్చారు.
వారితోపాటు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి. యాకుబ్ పాషా, మండల సీనియర్ నాయకులు కన్నెబోయిన వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పెసరి శివ, పానుగంటి వీరస్వామి, మాజీ వార్డు సభ్యులు హెచ్చు శివ,గోపగాని యాదగిరి గౌడ్, గూడూరు మాజీ సిటీ యూత్ ప్రెసిడెంట్ మండల మల్లేష్, నూకల శ్రీనివాస్, ఇనుముల శ్రీనివాస్, గొడుగు మూణేష్, మందుల ప్రవీణ్, దోమ శీను, బొల్లంపల్లి నితిన్, దారావత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.