by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:16 PM
సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సాయి రమాదేవి చేర్యాలలో త్వరలో ప్రారంభించబోయే కోర్టు భవనాలను పరిశీలించి,జరిగిన పనులను పర్యవేక్షించి జరగబోయే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేసి సూచించడం జరిగింది.
జిల్లా న్యాయమూర్తి వెంట అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ సూర్యనారాయణ మూర్తి, సీనియర్ సూపరింటెండెంట్లు రవీందర్,అసిఫ్ ఇక్బల్,శ్రీహరి ఉన్నారు.ఇట్టి కార్యక్రమంలో చేర్యాల తహశీల్దార్ సమిర్ హమ్మద్ ఖాన్,ఆర్ఐ రాజేందర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ ఎస్ నాగేందర్,మేనేజర్ ప్రభాకర్, చేర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూమిగారి మనోహర్,వైస్ ప్రెసిడెంట్ కాటం సురేందర్,జాయింట్ సెక్రెటరీ పర్వతం రాములు,కోశాధికారి అంకని సురేందర్,సీనియర్ న్యాయవాది ఆరెళ్ళ మహేందర్ మరియు మెరుగు రమేష్,నీరటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.