by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:02 PM
ముస్తాబాద్ నుండి రాజక్క పేట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ నుండి దుబ్బాక రామయంపేట్ మెదక్ మేడ్చల్ ప్రాంతాలకు ఎక్కువ మంది నిత్యం ప్రయాణం చేస్తారని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 14 కోట్ల నిధులతో ముస్తాబాద్ రాజక్క పేట వరకు మంజూరు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోడ్డు నిధులను రద్దు చేసిందని తెలిపారు బిటి రోడ్డు ఉండడం వల్ల నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు ముస్తాబాద్ రాజక్క పేట మంజూరు చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు హోమ్ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కోరారు