by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:53 PM
కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్న తరుణంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తిమ్మాపూర్ మండలంలో గల అలుగునూర్ చౌరస్తాలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు తమ్మనవేని రమేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్, మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఇక్కడ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఒకటైన సన్నాలకు బోనస్ హామీని సీఎం నిలబెట్టారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది లక్ష్మీనారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, నాయకులు కొండం రాజేందర్ రెడ్డి, చిందం కిష్టయ్య, బొల్లాడి కృష్ణారెడ్డి, కంది అశోక్ రెడ్డి, పోలు రాము, రమేష్, తొర్తి అరవింద్, ఆశిక్ పాషా, ముంజ శ్రీకాంత్ గౌడ్, పొనగాని మహేష్ యాదవ్, కాత కొమురయ్య, సిరిసిల్ల చంద్రయ్య, వేంకటేశం తదితరులు పాల్గొన్నారు.